NTV Telugu Site icon

PVN Madhav: జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు ఉండదు.. త్వరలోనే ఉమ్మడి పోరాటాలు..!

Pvn Madhav

Pvn Madhav

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఒకరు అంటే.. అంతే ఏకమై.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మరికొందరు అంటున్నారు.. కానీ, తమకు జనసేన పార్టీతోనే పొత్తు.. మరో పార్టీ అవసరం లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పొత్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేనతో తప్ప ఇతర రాజకీయపార్టీలతో పొత్తులు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీతోనే పొత్తు ఉంటుందని.. త్వరలోనే జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

Read Also: Nandamuri Fans: ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’ చేసారు… ఇదెక్కడి అరాచకం మావా

ఇక, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీలకు సీఎం వైఎస్‌ జగన్ పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది భారతీయ జనతా పార్టీ.. పీఎంఏవై కింద కేంద్రం ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇస్తుంటే.. సీఎం జగన్‌పేరు ఎందుకు పెట్టాలి..!? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే జగన్ పేరు తొలగించాలని లేని పక్షంలో జనవరి 3వ తేదీన ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఎమ్మెలసీ పీవీఎన్ మాధవ్.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై హాట్‌ హాట్ చర్చలు సాగుతూనే ఉన్నాయి.. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభ పెట్టినా.. అది బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడని.. ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడనే విమర్శలు వస్తున్న విషయం విదితమే.