మా అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి జిన్నా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ వెంటనే తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడాన్ని కూడా బీజేపీ తప్పుబట్టింది.
ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి జిన్నా మూవీ టైటిల్‌పై ఓ ట్వీట్ చేశారు. జిన్నా పేరుతో సినిమా టైటిల్‌ను మంచు విష్ణు వెంటనే ఉపసంహరించుకోవాలని.. ఈ సినిమా టైటిల్ లోగోను తిరుమల తిరుపతి ఏడుకొండల మధ్య ఉంచడమేంటని ఆయన ప్రశ్నించారు. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు అని.. జిన్నా వల్ల ఎంతోమంది హిందువులు ప్రాణాలు, మానాలు కోల్పోయారని విష్ణువర్ధన్‌రెడ్డి గుర్తుచేశారు. దేశభక్తి గల ఏ వ్యక్తి ఈ సినిమా టైటిల్‌ను హర్షించరని ఆయన అభిప్రాయపడ్డారు.
'జిన్నా' పేరుతో సినిమా టైటల్ ను ఉపసంహరించుకోండి విష్ణు గారు. @iVishnuManchu జిన్నా సినిమా తిరుమల తిరుపతి ఏడుకొండల మధ్య నుంచి టైటిల్ లోగో ఉంచడం ఏంటి?
మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు 'జిన్నా' వలన హిందువుల ప్రాణాలు – మానాలు కోల్పోయారు.దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు . pic.twitter.com/pmJ2JqKZGf
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 12, 2022