ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును ఊడ్చివేశం, మళ్లీ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఉడ్చివేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మూడు వేల టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని ఆయన కొనియాడారు. 40 ఏళ్ల తిరుమల స్థానికుల సమస్యలు తీర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంది అని ఆయన వెల్లడించారు. తిరుపతి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మనదని, కరోనా సమయంలో 200 శవాలను ఒక ఎమ్మేల్యేగా వాటిని ఖననం చేసిన ఘనత నాది అని ఆయన వెల్లడించారు.
సాక్షాత్తు దేశ ప్రధాని కార్యాలయం నుంచి కరోనా కష్ట కాలంలో శవాలు ఖననం చేసినందుకు ప్రశంసించారని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కరోనా సమయంలో చేసిన సేవలకు ఇది గుర్తింపు అని ఆయన తెలిపారు. తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు, జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించామని, త్వరలో జరగబోయే తిరుపతి టౌన్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.