Bank Robbery: శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ బ్యాంకులో భారీ దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దోపిడీ చేసిన అనంతరం దుండగులు బ్యాంకులోని సీసీ కెమెరా రికార్డులను కూడా ఎత్తుకుపోయినట్లు సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు దోపిడీకి పాల్పడి పరారైన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Konaseema: కోనసీమ అల్లర్లు.. 46 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Also Read
శ్రీకాళహస్తీ కేసులో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారిస్తున్నామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ముగ్గురు దొంగలు రాత్రి బ్యాంకు మేనేజర్ కాళ్ళు, చేతులు కట్టేసి కత్తితో బెదిరించి దొంగతనం చేశారని ఆయన తెలిపారు. దాదాపు రూ.కోటికి పైగా విలువచేసే బంగారం, నగదు దోచుకెళ్ళారని వివరించారు. దొంగల కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వాళ్ల డబ్బు, బంగారం ఎక్కడికీ పోదని తిరుపతి ఎస్పీ ధైర్యం చెప్పారు.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!