Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bandi Srinivasa Rao About Chalo Vijayawada

అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా‌ విడుదల చేయాలి.. రేపు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌

Published Date :February 3, 2022 , 9:55 pm
By Sudhakar Ravula
అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా‌ విడుదల చేయాలి.. రేపు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

పీఆర్సీ విష‌యంలో ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఉద్యోగులు.. ఇవాళ ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం నిర్వ‌హించారు.. విజ‌య‌వాడ‌లోని రోడ్లు.. ఉద్యోగుల‌తో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్ష‌లు విధించినా.. ఉద్యోగుల కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోలేక‌పోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆప‌లేక‌పోయాయి.. ఇక‌, ఛ‌లో విజ‌య‌వాడ‌పై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు త‌ర‌లివ‌చ్చార‌ని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను ఉద్యోగస్తులు విజయవంతం చేశార‌న్న ఆయ‌న‌.. రేపు మ‌రోసారి సమావేశమై కార్యాచరణ ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.

పోలీసుల హెచ్చరికల నేప‌థ్యంలో ఛలో విజయవాడకు వచ్చే ఉద్యోగస్తులకు మేం త‌గిన‌ ఏర్పాట్లు చేయలేకపోయామ‌న్నారు బండి శ్రీ‌నివాస‌రావు.. కానీ, ప్రజలు స్వచ్చంధంగా వచ్చి మంచినీరు, ఆహారం అందించార‌ని.. కొన్ని చోట్ల పోలీసులు మాకు సహకరించారు.. వారికి ధన్యవాదాలు అని తెలిపారు. మ‌రోవైపు.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి చర్చల ద్వారా పరిష్కరిద్దామని అంటున్నారు.. దీనిపై రేపు స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా‌ విడుదల చేయాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. ఉద్యోగస్తుల ఆశలను ఆవిరి చేయం.. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడతామ‌ని స్ప‌ష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap employees
  • Bandi Srinivasa Rao
  • chalo vijayawada
  • CS Sameer Sharma

తాజావార్తలు

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions