Attack on TDP Office: గన్నవరంలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయుల దాడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on TDP Office: మరోసారి గన్నవరం గరంగరంగా మారింది.. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారని చెబుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో.. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.. ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయులు దాడి చేశారు.. ఈ దాడిలో టీడీపీ ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి.. అదే విధంగా ఆఫీసు ముందు పార్క్ చేసిన ఓ కారుకు కూడా నిప్పుపెట్టారు.
Read Also: PM Modi: పీఎం మోదీకి షాకిచ్చిన సీఎం.. ఎన్నికల ర్యాలీ నిర్వహణకు నో పర్మిషన్
Also Read
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
- Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
గన్నవరంలో టీడీపీ, ఎమ్మె్ల్యే వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం రెండు, మూడు రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టీడీపీ నేతలు.. గన్నవరం టీడీపీ కార్యాలయం నుండి జాతీయ రహదారి పై నిరసనగా బయలుదేరి గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు.. డౌన్ డౌన్ వంశీ అంటూ నినదించారు.. ఈ సమయంలో.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ ఆఫీసు చుట్టూ కారులో తిరిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. ఇక, టీడీపీ వాళ్లు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లగానే.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.. పెట్రోల్ డబ్బాలు, క్రికెట్ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.. అక్కడే ఉన్న ఓ కారుకు నిప్పుపెట్టారు.. ఈ దాడిలు పలు కార్ల అద్దాలు ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. దీంతో, గన్నవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!