Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- మక్కా రక్షణ ఒప్పందం తొలిసారి అమల్లోకి..
- హౌతీలపై పాక్ ఫైటర్ జెట్లు దాడులు చేస్తున్నట్లు రిపోర్ట్..
- అధికారికంగా ధ్రువీకరించని పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mecca Pact: యెమెన్‌లోని హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగంగా సౌదీకి అండగా పాకిస్తాన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు హౌతీ స్థావరాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, పాకిస్తాన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు హౌతీలపై జరుగుతున్న దాడుల్లో ఉపయోగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. టర్కీ-సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య కుదిరిన ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’ కింద సౌదీలో పాక్ తన బలగాలను మోహరించినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. అయితే, బలగాలు సంఖ్య, వాటి సామర్థ్యాలపై వివరాలను వెల్లడించలేదు. సౌదీలో సుమారు 8000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మోహరించినట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. ఇందులో పాక్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిబ్బంది ఉన్నట్లు అంచనా వేశారు. కీలక చమురు మౌలిక వసతుల రక్షణలో వీరిని ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
ఇదిలా ఉంటే టర్కీ మాత్రం సౌదీకి తమ సైన్యాన్ని పంపించే విషయంలో సుముఖంగా లేదని తెలుస్తోంది. హౌతీల దాడుల నుంచి సౌదీని ఎలా రక్షించాలనే దానిపై తమ దేశం ఎలా సహకరించాలో పరిశీలిస్తోందని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ తెలిపారు. మక్కా ఒప్పందం రక్షణాత్మకమైనదే కానీ దాడులకు సంబంధించింది కాదు అని ఆయన స్పష్టం చేశారు. టర్కీ ప్రస్తుతం ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సాంకేతిక సహాయం అందించే విషయంపై ఆలోచిస్తోంది.
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!