Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Ravi: “విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. ఎవరి జోలికీ వెళ్లడు.. ఎవరి గురించీ మాట్లాడడు. తన పని, తన సినిమాలు తప్ప అతనికి మరో ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే చాలా బాధేస్తోంది” అంటూ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా నెటిజన్లకు, ట్రోలర్లకు ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు ఆయన. “గత ఏడెనిమిదేళ్లుగా మేము విజయ్‌తో ట్రావెల్ అవుతున్నాం. అతను ఎంత మంచోడో, ఎంత సాఫ్ట్‌గా ఉంటాడో మాకు బాగా తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే.. అతను ఏం చేసినా సరే కావాలనే ఒక పద్ధతి ప్రకారం నెగెటివ్ ప్రచారం మొదలుపెడుతున్నారు. అసలు ఎందుకు మీకీ పిచ్చి పనులు? అతనిపై మీ మనసులో ఏమైనా నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే దయచేసి వాటన్నింటినీ తీసేయండి. పాజిటివ్ ఆలోచనతో అతన్ని చూడండి” అని కోరారు.
కనీసం ట్రైలర్, సినిమా రాకముందే నెగెటివిటీని స్ప్రెడ్ చేయడంపై రవిశంకర్ సూటిగానే ప్రశ్నించారు. “సినిమా చూశాక నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి, తప్పులేదు. కానీ ఏమీ చూడకుండానే.. ఇది బ్రిటిష్ కాలం నాటి కథంట, ఇలాంటివి ఇప్పుడు ఆడతాయా అంటూ పోస్టులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక సినిమా కోసం ఒక నటుడు ఎంత శ్రమపడతాడో ఎవరైనా ఆలోచిస్తున్నారా? దయచేసి ఆ విష ప్రచారాన్ని పక్కనపెట్టి, అతను పెట్టిన ఎఫర్ట్‌ను గుర్తించి మెచ్చుకోండి” అంటూ హితవు పలికారు. ‘రణబాలి’ కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టాన్ని రవిశంకర్ ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఈ కథ కోసం దాదాపు 100 రోజుల పాటు గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్ కోసం పూర్తిస్థాయిలో మారిపోయారని చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రెండేళ్లపాటు ఆఫీస్‌కే పరిమితమై ఎంతో రీసెర్చ్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుత ప్రపంచం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఎలాంటి నెగిటివిటీ లేకుండా, స్వచ్ఛమైన మనసుతో చూడాలని.. కచ్చితంగా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని నిర్మాత రవిశంకర్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
తాజావార్తలు
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!