Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ricky Ponting About Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 మినీ వేలానికి నెల రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన భారీ ట్రేడ్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడం. మరోవైపు పంజాబ్ జట్టు నుంచి అర్ష్‌దీప్ సింగ్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి వెళ్లాడు. హార్దిక్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల కింగ్స్‌కు ఏం ప్రయోజనం కలుగుతుందో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వివరించాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. హార్దిక్ పాండ్యా అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని తెలిపాడు. ‘ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలిచిన జట్లలో హార్దిక్ భాగస్వామిగా ఉన్నాడు. వాటిలో నాలుగు ముంబై ఇండియన్స్‌తో సాధించినవే. ఎన్నో ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆడిన అనుభవం అతడికి ఉంది. గత రెండు సీజన్లలో, ముఖ్యంగా కీలకమైన మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం పంజాబ్ కింగ్స్‌కు ప్రతికూలంగా మారింది. కీలక మ్యాచ్‌ల్లో అనుభవం కొరవడటమే మా జట్టు వెనుకబడటానికి ఓ కారణం. హార్దిక్ రాకతో ఆ లోటు భర్తీ అవుతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read
- SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
- Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
- Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
హార్దిక్ పాండ్యాను భారత క్రికెట్లో అత్యుత్తమ వైట్‌బాల్ ఆల్రౌండర్లలో ఒకరిగా పాంటింగ్ అభివర్ణించాడు. ‘ఐపీఎల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరైన హార్దిక్ మా జట్టులో చేరడం సంతోషంగా ఉంది. అతడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు, బంతితోనూ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టగల సామర్థ్యం హార్దిక్‌కు ఉంది. మిడిల్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగలడు. అవసరమైతే డెత్ ఓవర్లలోనూ ఒక ఓవర్ వేయగలడడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు అవసరమైన సమయంలో హార్దిక్ సేవలందింస్తాడు. హార్దిక్ ఈ సీజన్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో ఈసారి అతడు పెను ప్రభావం చూపాలని కోరుకుంటున్నా. అతడి రాకతో మాకు ఉత్సాహభరితమైన రోజులు ముందున్నాయి’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా తిరిగి రావడం ఊహించని పరిణామంగా నిలిచింది. అతడి నాయకత్వంలో ముంబై ఇండియన్స్ మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రెండుసార్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడంతో జట్టు ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత అభిమానుల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ హార్దిక్‌కు ఆశించిన స్థాయిలో సీజన్లు సాగలేదు. అయితే గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో హార్దిక్ 2022లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓటమి పాలైంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరఫున కొత్త ప్రయాణం ప్రారంభించనున్న హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UNEXPECTED – SAFED SACH: దేశాన్ని కుదిపేసిన డెహ్రాడూన్ బస్సు ఘటనపై సినిమా
-
Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..
-
AI Data Centre Row: విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు!.. అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్
-
Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!