APSRTC : సంక్రాంతి పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పండుగ సీజన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజర్వేషన్లు దాదాపుగా నిండిపోయిన నేపథ్యంలో, అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Hyundai Venue HX 5 Plus: హై-టెక్ ఫీచర్లతో.. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ వేరియంట్ రిలీజ్..
ఈ ఏడాది సంక్రాంతి పండుగ బుధ, గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ప్రయాణాల రద్దీ ముందే ప్రారంభం కానుంది. గత ఏడాది పండుగ రోజులు వీకెండ్‌కు అటు ఇటుగా ఉండటంతో రద్దీ అంతా ఒకేసారి ఉండేది, కానీ ఈసారి రద్దీ శుక్రవారం రాత్రి నుంచే మొదలై వారం అంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్‌ను రూపొందించారు. ముఖ్యంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలైన రాజమండ్రి, రావులపాలెం, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరంతరం బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కేవలం రాష్ట్రంలోని జిల్లాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. వీరి కోసం సుదూర ప్రాంతపు సర్వీసులను పెంచడమే కాకుండా, రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి ప్రయాణం సురక్షితంగా , సుఖవంతంగా సాగేలా ఆర్టీసీ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..