గ్రూప్1 అప్లికేషన్ల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) … గ్రూప్ వన్ అప్లికేషన్ దాఖలు గడువును మరో మూడు రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్.. గ్రూప్ వన్ అప్లికేషన్ దాఖలు గడువు మూడు రోజులు పెంచాం.. ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు.. ఇక, నాల్గోవ తేదీ అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుందని వివమరించిన ఆయన.. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో దరఖాస్తు గడువు ముగిసిందని.. చివరి రెండు రోజుల్లో దాదాపు 26 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.. నాలుగేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావటంతో మరింత మందికి అవకాశం కల్పించడానికే.. గడువును పెంచామన్నారు.. ఇప్పటి వరకు దాదాపు లక్షా రెండు వేల మంది అభ్యర్థులు గ్రూప్ వన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. యథాతథంగానే డిసెంబర్ 18వ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు గౌతమ్ సవాంగ్.
Read Also: Pawan Kalyan: పవన్‌ని వెంబడిస్తున్న ఆగంతకులు.. కారు ఆపి మరీ..