పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారు అధికారులు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే…