AP Youth Trapped: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను అమ్ముతున్న వైనం.. నరకం చూపిస్తున్న ఏజెన్సీలు
- ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళిన తెలుగు యువతపై అమానుష ఘటన..
- ఏపీకి చెందిన 21 మందిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు ఆరోపణలు..
- కిడ్నాప్ కు గురైన బాధితులను విడిపించాలని కోరతున్న నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Youth Trapped: ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళిన తెలుగు యువతపై అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. విదేశీ ఏజెన్సీల మోసపూరిత విధానాలతో మయన్మార్ సరిహద్దులో ఏపీ యువత బందీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు చెందిన 21 మంది యువకులు బందీగా ఉన్నట్లు తెలుస్తుంది. మొదట థాయిలాండ్‌లో ముగ్గురు వ్యక్తులు చెప్పడంతో స్నేహితులంతా ఉద్యోగాల కోసం వెళ్లగా, ఆ తర్వాత మోసపోయారు. అయితే, థాయిలాండ్ ఏజెన్సీ నిర్వాహకులు మొదట ఆశలు చూపించి ఉద్యోగాల్లో చేర్చగా, తరువాత మయన్మార్ ఏజెన్సీకి యువతను అమ్మేశారు. అక్కడ యువతను ఆన్లైన్లో అమ్మాయిల మాదిరి మాట్లాడిస్తూ చాటింగ్ చేయించడమే పని అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పని చేయలేమని చెప్పగానే ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు తెలియజేశారు.
Read Also: Asim Munir: దేవుడు నన్ను రక్షకుడిని చేశాడు.. నాకు ఏ పదవి వద్దు..
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్‌లో రాంబాబు స్పీడ్
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
అయితే, విదేశీ ఏజెన్సీల నునంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే శాశ్వతంగా జైల్లో నిర్బంధిస్తామనే బెదిరింపులను కూడా ఎదుర్కొంటున్నారని బాధితులు తెలిపారు. దీంతో మమ్మల్ని రక్షించండి అని ఆర్తనాలు వినిపించారు. మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలియదు, మా లొకేషన్ కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, బాధిత యువత కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులను వరుసగా కలుస్తున్నారు. దీంతో నంద్యాల ఎంపీ, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరిని ఢిల్లీలో బాధితుల తల్లిదండ్రులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఎంపీ శబరి విదేశాంగ శాఖకు స్వయంగా కంప్లైంట్ చేశారు. ఇక, అదే విధంగా ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నేరుగా వీడియో కాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి చెందిన యువకులు ఉపాధి కోసం మయన్మార్ కి వెళ్తే.. అక్కడ కిడ్నాప్ కు గురయ్యారనీ తెలియజేశారు. బాధితులను భారత్ కు తీసుకోచ్చేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరారు. బంధించబడి తీవ్రమైన హింస, బలవంతపు పనులకు గురవుతున్న తమ రాష్ట్ర యువతను తక్షణమే విడుదల చేసి తీసుకు రావాలన్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?