ప్రతిపక్ష టీడీపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయడం అలవాటు చేసుకోవాలి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ అర్ధంపర్ధం లేకుండా తలాతోక లేకుండా విమర్శలు చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఇమేజ్ పోతుంది … మీపార్టీలే ఉనికి కోల్పోతాయి అని తెలిపారు. రాజకీయాలకు అలవాటుపడిన ప్రతిపక్షానికి సంక్షేమం అవసరం లేదు. మీరు ప్రశ్నిస్తే ప్రజలు మాకెందుకు అధికారమిచ్చారో పునఃసమీక్ష చేసుకోవాలి అని పేర్కొన్నారు.