Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. రాత్రి సమయాల్లో పని చేసేందుకు మహిళలకు అనుమతి ఇచ్చారు. ఏపీ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ సవరణ చట్టం అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వారానికి 48 గంటల పని విధానాన్ని కొనసాగిస్తూనే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి పెంచింది. ప్రస్తుతం వారానికి 14 గంటలు ఓవర్ టైం ఉండగా, మూడు నెలలకు 144 గంటలు ఓవర్ టైంగా నిర్ణయించింది. మహిళా సిబ్బంది సమ్మతితో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసేందుకు అనుమతించేలా ఏపీ సర్కార్ చట్ట సవరణ చేసింది.
Read Also: Bihar Assembly Elections: నేటితో ప్రచారానికి తెర.. బహిరంగ సభల్లో పాల్గొననున్న బీజేపీ సీనియర్ నేతలు!
అయితే, నైట్ డ్యూటీలో ఉన్నవారికి అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 20 మంది లోపు సిబ్బంది ఉన్న సంస్థలకు కొన్ని రిజిస్టర్ల నిర్వహణ నుంచి మినహాయింపు ఇచ్చింది. సిబ్బంది రిజిస్ట్రేషన్, రెన్యూవల్, సెలవులు, తొలగింపు లాంటి రిజిస్టర్లను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.