Site icon NTV Telugu

AP Reorganisation : రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026

Ap Bill

Ap Bill

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..

2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని ఏర్పాటు చేసుకునే వీలుంది. అయితే, చట్టంలో ఉన్న సాంకేతిక అంశాలను సవరిస్తూ, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ అని స్పష్టంగా పేర్కొంటూ ఈ సవరణ చేయబోతున్నారు. దీనివల్ల అమరావతికి ఒక స్థిరమైన రూపం ఏర్పడటమే కాకుండా, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి రాజకీయ అనిశ్చితులకు తావు లేకుండా పోతుంది.

Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్

రేపు లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సుమారు గంట పాటు చర్చ జరగనుంది. అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రేపు లేదా ఎల్లుండి (ఏప్రిల్ 2) కల్లా రాజ్యసభలో కూడా చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించనుంది. రాజధానిపై స్పష్టత లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడారు. ఇప్పుడు కేంద్రం నేరుగా చట్ట సవరణ చేస్తుండటంతో, అంతర్జాతీయ సంస్థలు , పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగనుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి , మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version