AP Employees Rules: ఉద్యోగుల కేటాయింపునకు మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగా జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసింది ప్రభుత్వం. వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్న సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ. ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్వవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని పేర్కోన్న ప్రభుత్వం.
ఏప్రిల్ 2 తేదీని జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధించి అప్పాయింటెడ్ డే గా పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది ప్రభుత్వం.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్ స్థాయిలోని ఉద్యోగులను మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల తర్వాత ఉద్యోగులు ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లే అవకాశమున్నందున బదిలీలపై నిషేధం ఉత్తర్వులను సడలించనున్నట్టు పేర్కోన్న ప్రభుత్వం.కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తాత్కాలిక ప్రాతిపదికనే కొత్త జిల్లాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.
ఏపీ పోలీసు విభాగం మినహా మిగతా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, డివిజన్లకు అనుగుణంగా మార్పు చేర్పులు ఉంటాయని తెలిపింది ప్రభుత్వం. మార్చి 11 తేదీ నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా సిద్ధమవుతుందని పేర్కొంది ప్రభుత్వం. తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
తాజావార్తలు
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!