Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranganath: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో నాలాను ఆనుకుని కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో దాదాపు 10 ఫ్లాట్ల వరకు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహబత్, ఉమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ భవనంలో టైల్స్ పనులు చేయడానికి వచ్చిన కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. భవనం కూలిన ప్రదేశంలో శిథిలాల కింద మరికొందరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో జీహెచ్ఎంసీ, హైడ్రా (HYDRAA), డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లు, పోలీసులు వేగంగా సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు సమీపంలోని హాస్టల్ విద్యార్థులు, అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
అయితే.. తాజాగా ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఈ చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తామని హెచ్చరించారు. “సాజిద్ అనే బిల్డర్ హాస్టల్స్ నిర్మాణం చేస్తున్నాడు. అతడు చేసే నిర్మాణాలు ప్రతిసారి ఇలానే ఉంటాయని మేము వింటున్నాం. అతడి సంగతి కూడా చూస్తాం..” అని రంగనాథ్ తెలిపారు. మరోవైపు.. మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడుతూ.. గతంలోనే ఈ నిర్మాణాలపై మాకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణాలను ఆపి సీజ్ చేశామని, మళ్ళీ నిన్న వర్క్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. నాలాను ఆక్రమించి నిర్మాణలు ఉన్నాయని తెలిపారు. ఈ బిల్డింగ్ చుట్టూ చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందన్నారు. 7+పెంట్ హౌజ్ కోసం నిర్మాణం చేస్తున్నాడని వివరించారు.
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!