సామాజిక సమతౌల్యం సాధ్యం అవుతుందని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభ స్థానాలను అగ్ర కులాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని అన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే ఒకటి కమ్మ, ఒకటి క్షత్రియకు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించి, దాడికి పాల్పడితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చుంటే, చంద్రబాబు కు బ్యాగులు మోస్తుంటే కేసులు పెట్టారా… ఏబీ వెంకటేశ్వర్లు ద్వారా పోలీసులను కార్యకర్తలను ఉపయోగించుకున్నది చంద్రబాబు. కానీ ఇది చంద్రబాబు నాటి ధృతరాష్ట్ర పాలన కాదు అని తెలిపారు.
ఉద్రిక్తతలు చోటు చేసుకుకోకూడదనే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీనే కాదు మైలవరం ఎమ్మెల్యేను, వైసీపీ నేతలను కూడా పోలీసులు స్వీయ నిర్బంధం చేశారు. చంద్రబాబు మాటలే వాస్తవాలు అయితే చంద్రబాబు హైదరాబాద్ నుంచి షికారు కు వచ్చినట్లు వచ్చి ఉండగలిగే వారా… చంద్రబాబు కాలంలో ఉమ చేసిన అక్రమ మైనింగ్ , అధికారితో స్టే ఇప్పించటం పై విచారణ చేయాలని మేము కూడా గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం