అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగే సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే అన్నారు.. బీజేపీలోని టీడీపీ నేతల ద్వారా ఈ పని చేయించారని విమర్శించారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాకు…
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.. విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగే సమావేశం అజెండాలో మొదట స్పెషల్ స్టేటస్‌ను చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత మళ్లీ తొలగించడంపై ఏపీ గుర్రుగా ఉంది.. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తోంది తెలుగు దేశం పార్టీ.. ఈ వ్యవహారంపై శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ…