హీరోయిజం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలొద్దు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్ ను నమ్ముకొని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.. సీజన్ ముగిశాక చంద్రబాబుకు మామిడి రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేసిన ఆయన.. మూడు నెలలుగా మామిడి ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష చేస్తున్నామని.. ఎమ్మార్వో స్థాయి అధికారులకు మామిడి ఎగుమతులు, దిగుమతులపై పర్యవేక్షణ ఉండాలని ఆదేశించామని తెలిపారు.
also read కేసీఆర్ మొదట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు.. ఇప్పటి వ్యవహారం నాకు నచ్చలేదు..!
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ శాఖ దృష్టి సారించిందని తెలిపారు మంత్రి కన్నబాబు.. కరోనా కష్టకాలంలోనూ రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాలో మామిడి బోర్డును ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశాం.. రైతులు నష్టపోతున్నారని తెలిసి ప్రభుత్వమే ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తోందని.. చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి మేం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. ప్రాసెసింగ్ యూనిట్లను ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, హార్టీ కల్చర్ అధికారులు విజిట్ చేస్తున్నారన్న ఆయన.. రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేశారు. ఏపీ రైతులు దగ్గర ఉత్పత్తులు బాగున్నాయని కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేశారని తెలిపారు మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!