Atchannaidu vs Botsa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షకాల సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా మండలిలో మొదట రైతాంగ సమస్యలు, యూరియా కొరతపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఇక, వైసీపీ ఆందోళనలతో శాసన మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.
Read Also: Pakistan Cricket: అక్కడ 16 మిలియన్ డాలర్లు.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు!
అయితే, వైసీపీ సభ్యుల ఆందోళనపై మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. యూరియా కొరత, వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది అని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియజేసే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక, బీఎసీ సమావేశం అనంతరం సభలో చర్చ చేపట్టేందుకు సిద్దమని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఇక, మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
ఇక, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని మంత్రి అచ్చన్నాయుడుని ప్రశ్నించారు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం.. రైతాంగం బాగుంటే అందరూ బాగుంటారు.. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నామని డిమాండ్ చేశారు.
కాగా, బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందనేది చర్చ జరగాలి.. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చర్చిద్దాం.. సభ ద్వారా రైతులకు అన్నీ విషయాలు తెలియాలి.. రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాం.. రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందనేది చెప్పటానికి మేం సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు అని మంత్రిని అడిగారు. ఈ రోజే చర్చిస్తే తప్పేముంది.. గతంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు.. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే, ఈరోజే చర్చించమని కోరుతున్నామన్నారు.
