Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap High Court Focus On Amaravati Cases

అమరావతి కేసులపై విచారణ షురూ

Published Date :November 15, 2021 , 8:41 am
By NTV WebDesk
అమరావతి కేసులపై విచారణ షురూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది . సీఆర్డీ యే రద్దు చట్టం , పాలనా వికేంద్రణ లపై దాఖలైన పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. ప్రస్తుతం 90కి పైగా పిటీషన్లు దాఖలు చేశారు . ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.

రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైతులు, నేతలు 90కి పైగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లనూ నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ విచారణ చేపట్టనుంది. వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరగనుంది. కొవిడ్ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతుల్లో కేసులను విచారిస్తున్నారు.

Also Read

  • Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
  • CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్‌ వార్నింగ్..
  • Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
  • CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గతేడాది జనవరిలో సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణపై మొదటిసారి జస్టిస్ జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరఫు న్యాయవాదుల వాదనలనును పూర్తిగా వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. జస్టిస్ జేకే మహేశ్వరీ ఈ ఏడాది జనవరిలో బదిలీ కావటంతో విచారణ నిలిచిపోయింది. తర్వాత హైకోర్టు సీజేగా అరూప్ కుమార్ గోస్వామి రావటంతో మరోసారి ఆయన ముందుకు విచారణకు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 13న విచారించారు. నవంబర్ 15 తదుపరి విచారణ వాయిదా వేశారు. దీంతో నేటి నుంచి రోజువారీ విచారణను ప్రారంభించనున్నారు.

సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలింపు అంశాలపై రైతులు 697 రోజుల నుంచి దీక్ష చేపడుతున్నారు. గతంలో విచారణ జరిగిన తర్వాత అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. అంశాల వారీగా పిటీషన్లను విచారించాలని గతంలోనే ధర్మాసనం నిర్ణయించింది. రైతుల తరపు న్యాయవాదులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై వరుసగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ రోజు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • AP Highcourt
  • cases
  • cm jagan
  • save amaravati

తాజావార్తలు

  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..

  • AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!

  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..

  • Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..

  • TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions