AP High Court : టీటీడీ బోర్డు మెంబర్లపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జీవో ఇవ్వనందున ఆర్డినెన్స్ చెల్లదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీంతో ఆర్డినెస్స్ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటిషనరుకు ధర్మాసనం సూచించింది.
జీవోపై హై కోర్టు ఇచ్చిన స్టే పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో భూమనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్ విచారణకు అనుమతించద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే భూమన స్వప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారన్న పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు వివరించారు. ప్రభుత్వం మెమో కాపీ అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. తాము కౌంటర్ వేసే వరకు స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. మెమో కాపీ అడిగి తీసువాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!