AP High Court: ఏపీ హైకోర్టు మెజిస్ట్రేట్ కోర్టులకు ఒక కీలకమైన సర్కులర్ జారీ చేసింది. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టులు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గాడి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ లాంటి కేసుల తీర్పులను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఏపీ హైకోర్టు పేర్కొంది.
Read Also: NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
ఏపీ హైకోర్టు ముఖ్య సూచనలు:
* 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉన్న కేసుల్లో, విచారణ అధికారి ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి..
* ఈ కేసు విచారణను 14 రోజుల లోపు పూర్తి చేయాల్సిందే..
* ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి..
* మేజిస్ట్రేట్లు ఈ ఆదేశాలను అతిక్రమిస్తే హైకోర్టు సీరియస్ గా పరిగణిస్తుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఎదురవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ సర్కులర్ ప్రకారం మానవ హక్కుల పరిరక్షణతో పాటు ఆచరణలో పోలీసులు, న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు వెల్లడించింది.