ఈ మధ్యకాలంలో ఏ నిర్మాతను కదిపినా ఒకటే మాట, సినిమాలకు టైమ్ బాలేదండి, జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇప్పుడు సినిమా చేయడం అంత మంచిది కాదు అనే మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒక యంగ్ నిర్మాత అయితే ఏకంగా సభా వేదికగా థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు.
Also Read:HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్
అయితే వాస్తవానికి నిన్న ఆదివారం వీకెండ్ కాగా, రెండు సినిమాలకు థియేటర్లలో టికెట్ దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ సినిమాల్లో ఒకటి తెలుగు సహా మిగతా భారతీయ భాషల్లో రిలీజ్ అయిన యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ కాగా, మరోటి బాలీవుడ్ నుంచి వచ్చిన సైయారా. ఒక్క హైదరాబాద్ ఉదాహరణగా తీసుకుంటే నిన్న ఈ రెండు సినిమాలకు టికెట్లు దొరకలేదు. హరిహర వీరమల్లు సినిమాకి కూడా మంచి బుకింగ్స్ నమోదయ్యాయి.
Also Read:Bandhavi Sridhar : శారీలో బాంధవి శ్రీధర్ భలే ఉందిగా
కాబట్టి జనాలు థియేటర్లకు రావడం లేదు అనే మాట ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్లను థియేటర్ల వరకు మనం రప్పించలేకపోతున్నాం. వాళ్లకు కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇది ఓటీటీ కాదు, సినిమా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని మనం ప్రమోషన్ చేయడం కాదు, మన కంటెంట్ ప్రమోషన్ చేసుకోగలగాలి. అలాంటి కంటెంట్ ఇచ్చినప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు కదిలి వస్తారు. కాబట్టి ఇకనైనా ప్రేక్షకుల మీద నిందలు వేయడం ఆపి, కంటెంట్ బాగా వచ్చేందుకు ప్రయత్నిస్తే కాస్తైనా కూసో ఫలితం ఉంటుంది.