AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- కృష్ణా జిల్లాలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
- 115 మండలాల్లో 44 డిగ్రీలపైగా ఎండల తీవ్రత
- శనివారం వరకు వడగాల్పుల హెచ్చరిక జారీ
- కొన్ని జిల్లాల్లో వర్షాలు.. ప్రజలకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. రోహిణీ కార్తె ప్రభావంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత రాబోయే శనివారం వరకు ఇలాగే కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇందులో ముఖ్యంగా పల్నాడు, కృష్ణా, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎండ ఉధృతి అత్యంత ఎక్కువగా ఉంది. నిన్న కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో అత్యధికంగా ఏకంగా 48.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 45.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీలు, కోనసీమ జిల్లా శివల, కాкиనాడ జిల్లా కాజులూరులో 45.2 డిగ్రీలుగా ఎండ తీవ్రత రికార్డయింది.
రాబోయే మూడు రోజుల వాతావరణ ముందస్తు హెచ్చరికల ప్రకారం ఈ వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుంది. మంగళవారం రోజున రాష్ట్రంలోని 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక బుధవారం నాడు ఎండల తీవ్రత మరింత ముదిరి 70 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 176 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనుంది. ఆ రోజు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో ఎండలు 45 నుండి ఏకంగా 47 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం నాడు కూడా ఎండల వేడి ఏమాత్రం తగ్గకుండా కాкиనాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పైన పేర్కొన్న జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీల రికార్డు స్థాయిని తాకనున్నాయి. ఈ మూడు రోజుల్లో విజయనగరం, నెల్లూరు సహా గోదావరి జిల్లాల్లో 42 నుండి 44 డిగ్రీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఎండలు కొనసాగుతాయి.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తీవ్రమైన ఎండల నడుమ రాష్ట్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఉపశమనంతో కూడిన హెచ్చరికలను జారీ చేసింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ కూడా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, ఓపెన్ గ్రౌండ్స్ లేదా హోర్డింగ్స్ కింద నిలబడొద్దని అధికారులు ప్రత్యేకంగా సూచించారు. ఎండలు , వడగాల్పుల తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని, వాటిని వాయిదా వేసుకోవడమే మంచిదని పేర్కొంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వెంట మంచినీరు, గొడుగు లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లను తీసుకెళ్లాలని, వృద్ధులు, గర్భిణీలు , చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!