విదేశాల నుండి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదు అని ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి తెలిపారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హైమావతి అన్నారు. అయితే వైజాగ్ , సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించింది. వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా మా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. డైరెక్ట్ గా ఏపీలో విదేశీ ప్రయాణికులు దిగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. వందే భారత్ స్కీం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం విజయవాడ విమానాశ్రయంలో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాల్ని ఏర్పాట్లు చేశాం. వైద్య బృందాల పర్యవేక్షణలో నిరంతరమూ స్క్రీనింగ్, టెస్టులు చేస్తున్నారు అని ఏపీ హెల్త్ డైరెక్టర్ హైమావతి పేర్కొన్నారు.