గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను రివ్యూ చేసేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొందరు ఉద్యోగులపై నాటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏసీబీ కేసులు నమోదు చేసిందంటూ వచ్చిన వినతుల ఆధారంగా హైపవర్ కమిటీ నియామకం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను సమీక్షించాలని కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.

Read Also: IPO: ఐపీఓకి ఎలా అప్లై చేయాలి?
2014-19 మధ్య కాలంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను రివ్యూ చేయనున్న హైపవర్ కమిటీ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమలు, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. మెంబర్ కన్వీనరుగా వ్యవహరించనున్నారు జీఏడీ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి. ట్రాప్ చేసి.. ఏసీబీ రెడ్ హ్యాండెడుగా పట్టుకుని నమోదు చేసిన కేసులు మినహా మిగిలిన కేసులను సమీక్షించనున్నారు హైపవర్ కమిటీ.
Read Also: Tirumala Brahmotsavalu Live: ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతున్న స్వామివారు