Ap Capital Development: రాజధాని నిర్మాణానికి రూ.1329.21 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. శుక్రవారం కేవియట్ పిటిషన్లను అడ్మిట్ చేసుకుంది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వస్తే తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దని కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో మూడురాజధానుల బిల్లు తెస్తామని సీఎం జగన్, మంత్రులు పదే పదే ప్రకటిస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్ట్ తీర్పుపై కేవియట్ పిటిషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ఇదిలా వుంటే.. రాజధాని నిర్మాణం సహా వివిధ అవసరాల నిమిత్తం బడ్జెట్లో రూ. 1329.21 కోట్ల కేటాయించింది జగన్ ప్రభుత్వం. కేంద్ర నిధులు రూ. 800 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడతాని బడ్జెట్టులో పేర్కొంది జగన్ సర్కార్. రాజధాని గ్రామాల్లోని పేదల కోసం క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ నిమిత్తం రూ. 121.11 కోట్ల కేటాయించింది. రాజధాని రైతులకిచ్చే కౌలు చెల్లింపుల కోసం రూ. 208 కోట్ల కేటాయించింది. రాజధాని గ్రామాల్లో గ్రీనరీ, ఎల్ఈడీ బల్బుల నిర్వహణ, శానిటేషన్, కరకట్ట విస్తరణకు అవసరమైన భూ సేకరణ నిమిత్తం రూ. 200 కోట్లు బడ్జెట్టులో కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!