No Plastic In AP Secretariat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి రాష్ట్ర సెక్రెటేరియట్ లో నో ప్లాస్టీక్ విధానం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక నుంచి గాజు, స్టీల్ సీసాలతో నీటి సరఫరా చేయనున్నారు. అలాగే, ఉద్యోగులకు స్వచాంధ్ర కార్పొరేషన్ సహకారంతో స్టీల్ బాటిళ్లు పంపిణీ చేయనున్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యుట్ బాగ్ స్టాల్ ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ప్రారంభించారు.
Read Also: Raghunandan Rao: రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 71 వేల 977 దొంగ ఓట్లు..!
ఇక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ.. 8 నెలలుగా రాష్ట్రంలో స్వచ్చాంధ్ర కార్యక్రమం జరుగుతోంది.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం పై దృష్టి పెట్టాం.. ఏపీ సచివాలయంలో మొదటి సారి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాం.. సచివాలయంలో ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు వాడుతున్నారు.. సచివాలయంలో ఉద్యోగులకు స్టీల్ బాటిళ్లు అందిస్తున్నాం.. కొన్ని ప్రాంతాల్లో గ్లాస్ బాటిళ్లు ఉపయోగిస్తాం.. హ్యూమన్ టచ్ లేకుండా.. కొత్త టెక్నలాజీతో గ్లాస్ బాటిళ్లు రీ ఫిలింగ్ జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్. విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. సింగిల్ యూజ్డ్ ప్రత్యామ్నాయ పద్ధతిలో మెప్మా ఆధ్వర్యంలో జ్యూట్ బాగ్ లు, కొబ్బరి పీచుతో చేసిన బ్యాగులు అందుబాటులో ఉంటాయని సురేష్ కుమార్ వెల్లడించారు.