Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కల్లుగీత కార్మికుల కుటుంబాలకు పరిహారం రెట్టింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచిరూ.10 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
Read Also: Sabari Express: పట్టాలపై అడ్డంగా రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
Also Read
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
మరోవైపు నరేగా, ఇతరత్రా ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాటిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించనున్నారు. వీరికి వైఎస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు.
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!