Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంపై తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని 11వ షెడ్యూల్ 2, 3 నిబంధనలను అనుసరించి ఇరు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదీ జలాల లభ్యతను, వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వర్షాభావ పరిస్థితులు లేదా నీటి కొరత వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కంటే కూడా ప్రజల తాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కేఆర్ఎంబీ తేల్చిచెప్పింది.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల శ్రీశైలంలో నీటి మట్టం వేగంగా పడిపోతోందని, దీనివల్ల రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై సమగ్రంగా సమీక్షించిన కేఆర్ఎంబీ, శ్రీశైలంలో నీటి నిల్వలు నిలకడగా ఉండటం ఉమ్మడి రాష్ట్రాల తాగునీటి భద్రతకు అత్యంత కీలకమని అభిప్రాయపడింది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని బోర్డు ఆదేశించింది. వేసవి సమీపిస్తున్న కొద్దీ లేదా నీటి నిల్వలు తగ్గుతున్న సమయాల్లో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కృష్ణా జలాలను క్రమబద్ధంగా ఉపయోగించాలని బోర్డు తన ఆదేశాల్లో స్పష్టంగా వెల్లడించింది. నియంత్రణ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రాజెక్టుల వద్ద నీటి నిర్వహణపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!