Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free LPG Cylinders Scheme: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అక్కడి ప్రభుత్వం.. గోవా ప్రజలకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందించే పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏడాది రూ.3,000 జమ చేయనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ ఆర్థిక సాయం ఖాతాల్లోకి జమ కానుంది.
సెప్టెంబర్ 5 నుంచి దరఖాస్తు ఫారాలు
పనాజీలో జరిగిన కార్యక్రమంలో సీఎం ప్రమోద్ సావంత్ ఈ వివరాలను వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగానే మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తు ఫారాలు సెప్టెంబర్ 5 నుంచి గ్రామ పంచాయతీల్లో, ఎమ్మెల్యేల వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. అర్హత ఉన్న లబ్ధిదారులు ఫారాలను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పథకానికి అర్హులైన వారు దరఖాస్తుతో పాటు బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కాపీలను సమర్పించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. పత్రాల పరిశీలన అనంతరం అర్హత పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3,000 జమ చేస్తారు. ఈ మొత్తంతో ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్ల ఖర్చును లబ్ధిదారులు భరించగలుగుతారని సీఎం వివరించారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
కాంట్రాక్ట్ నియామకాలపై గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు గోవా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో ఇకపై కొత్తగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టకూడదని నిర్ణయించింది. అదే సమయంలో కనీసం 10 ఏళ్ల పాటు నిరంతరంగా పనిచేసిన అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకేసారి రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ‘Goa (Contractual Employees Regularization in Service) Rules, 2026’ను నోటిఫై చేసింది.
ప్రత్యేక అవసరాలకు మాత్రమే కాంట్రాక్ట్ నియామకాలు
కొత్త నిబంధనల ప్రకారం కన్సల్టెంట్లు, డొమైన్ నిపుణులు, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి పథకాల కోసం అవసరమైన సిబ్బంది వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాంట్రాక్ట్ నియామకాలకు మినహాయింపు ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక కేటగిరీల కింద నియమితులయ్యే వారికి భవిష్యత్తులో రెగ్యులరైజేషన్ కోరే హక్కు ఉండదు. వారికి కేటాయించిన పని లేదా నిర్ణయించిన కాలపరిమితి పూర్తైన వెంటనే కాంట్రాక్ట్ ముగియాల్సి ఉంటుంది.
కాంట్రాక్ట్ పొడిగింపుపైనా ఆంక్షలు
ప్రత్యేక అవసరాల కోసం తీసుకునే కాంట్రాక్టులను పొడిగించడం లేదా పునరుద్ధరించడం కూడా కొత్త నిబంధనల ప్రకారం అనుమతించరు. అదే పని అవసరం కొనసాగితే, గత కాంట్రాక్ట్‌ను పొడిగించకుండా కొత్తగా కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు నిర్ణయాలతో గోవా ప్రభుత్వం సంక్షేమంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?