AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ward Delimitation: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ డైరెక్టర్ సంబంధిత కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. వార్డుల డిలిమిటేషన్కు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించాలని సూచించారు. విశాఖపట్నం (GVMC), విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఆయా కార్పొరేషన్లు వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాల్సి ఉంటుంది.
అభ్యంతరాల స్వీకరణ
కార్పొరేషన్ల నుంచి అందిన వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు కూడా షెడ్యూల్లో అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
13న డిలిమిటేషన్ వార్డుల ప్రకటన
అభ్యంతరాల పరిశీలన అనంతరం సెప్టెంబర్ 13న డిలిమిటేషన్ చేసిన వార్డులను ప్రకటించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 14న ఏపీ గెజిట్లో వార్డుల పునర్విభజన వివరాలను ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన తదుపరి చర్యలు కొనసాగనున్నాయి.
వార్డుల పునర్విభజన షెడ్యూల్
* సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలి.
* 5 నుంచి 11 వరకు పునర్విభజన ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
* 13న డిలిమిటేషన్ చేసిన వార్డులను ప్రకటిస్తారు.
* 14న తుది వార్డుల పునర్విభజన వివరాలను ఏపీ గెజిట్లో ప్రచురిస్తారు
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..