Andhra Pradesh: అమరావతిలో భవనాల లీజు.. సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్‌డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విట్ యూనివర్సిటీకి ఇందులో ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విట్ యాజమాన్యంతో సీఆర్‌డీఏ సంప్రదింపులు కూడా జరిపింది.
భవనాల లీజు ద్వారా ఏడాదికి రూ. 8-10 కోట్ల మేర లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్లను లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన డీ-టైప్ భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఆరు టవర్లతో డీ-టైప్ బిల్డింగ్ నిర్మాణాలు జరగ్గా.. ముందుగా ఓ టవరును లీజుకివ్వాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. 2019 నాటికే 7.7 ఎకరాల విస్తీర్ణంలో 720 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. 65శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. 10,22,149 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా కూడా అందుబాటులోకి వచ్చింది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Peddi Reddy: చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!