AP Govt. : ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాల స్పందించిన ప్రభుత్వం.. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, ఇతర అన్ని అంశాలతో 8 పేజీల లేఖ విడుదల చేసింది ప్రభుత్వం. మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా… బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ఈ వాస్తవాలకు మసిపూసి… ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఎస్ రావత్ అన్నారు.
Also Read : Che Guevara Daughter: నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి
Also Read
- New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
- AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని వార్తపత్రికలు ప్రచురిస్తున్న కథనాలను ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకుండా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ… శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఉద్యోగుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
Also Read : Harish Rao: సీఎస్‌ఎస్ నిధులు ఇప్పించండి.. కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?