ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఉన్న నిధులు, కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న “అన్ రాక్” కంపెనీ ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించాను. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ ను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే, ఒక…