KRMB: తెలంగాణపై ఏపీ ఈఎన్సీ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిలువరించాలని ఆయన కోరారు.
ఎన్ఎస్పీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చేస్తోంది.ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 40.580 టీఎంసీలే.నాగార్జునసాగర్ నుంచి వదిలే నీటి ద్వారా పులిచింతల రిజర్వాయర్ నీటి మట్టం అసాధారణంగా పెరిగిపోతోంది.పులిచింతల ప్రాజెక్టుకు గత ఏడాది వచ్చిన వరద కారణంగా 16వ నెంబర్ గేటు కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే.నీటి నిల్వ చేయలేక పూర్తిగా నీటిని సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లో మరింతగా పెరిగితే పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే అవకాశం వుండదంటున్నారు ఇరిగేషన్ అధికారులు.
Also Read
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంది.ఇంకా నీటిని విడుదల చేస్తే.. ప్రకాశం బ్యారేజీతోపాటు పులిచింతల ప్రాజెక్టుకు ఇబ్బందులు కలిగేలా ఉంది.ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం మినహా మరోమార్గం లేదు.వేసవిలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుకోవాలి.అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించాలంటే ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి వినియోగాన్ని అడ్డుకోవాలి.తక్షణం విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా ఉత్తర్వులివ్వాలని ఈఎన్సీ కేఆర్ఎంబీని కోరారు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?