ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆందోళనల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజు శాసన సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం… వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం నిత్యం కొనసాగుతోంది.. అయితే, ఈ మధ్య త్వరలోనే తెలుగు దేశం పార్టీ బండారం బయట పెడతా? అంటూ అసెంబ్లీలో ప్రకటించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇవాళే టీడీపీ బండారం బయటపెడతానని ప్రకటించారు.. ఎన్టీఆర్ తీసుకుని వచ్చిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టిన ఆయన.. రాష్ట్రంలో కల్తీ సారా మరణాలు లేవన్నారు.. అయితే, చంద్రబాబు వ్యాపారంలో కల్తీ వల్ల ఎవరెవరు చనిపోయారో ఇప్పుడు జాబితా ఇస్తానని వెల్లడించి ఆయన.. చంద్రబాబుకు లాలూచీ పడి ఎంత మందికి డిస్టలరీలు మంజూరు చేశాడో బయట పెడతానన్నారు.. మా ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసిన ఆయన.. చంద్రబాబుకు ఏమీ దొరక్కే ఈ అంశం ఎత్తుకున్నాడని.. మా అభివృద్ధి చూసి చచ్చి సున్నం అయ్యాడని.. ఓర్వలేకే ఈ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
Read Also: Imran Khan: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. పదవి ఊడినట్టేనా..?