పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో మరణాలు ఇప్పుడు ఆందోళనకు కలిగిస్తున్నాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక, జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని…