దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలపై వడ్డన ప్రారంభించాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెంచేయగా.. తాజాగా గోవా రాష్ట్రం కూడా అదే జాబితాలో చేరింది.
మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌కు క్రమంగా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది… ఈ విడతలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది… ఆంధ్రప్రదేశ్‌కి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది… 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు…
Delhi Police Arrest Two Afghan Nationals, Seize Drugs Worth Over Rs 1,200 Crores: ఢిల్లీలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసుల దాడుల్లో ఏకంగా రూ.1200 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. మెథాంఫెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో ఈ డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంట్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు ఆప్ఘనిస్తాన్ జాతీయులను పోలీసుల అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం…
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (బీబీఎన్ఎల్) మరియు బీఎస్ఎన్ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ విలీనంతో, బీఎస్‌ఎన్ఎల్ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయతీల్లో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ఉపయోగించి 5.67 లక్షల కిలోమీటర్ల…
ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆ నిధులను విడుదల చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్‌ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ. 684 కోట్లు అందించనుంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు ఈ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లకు చేరనున్నాయి.. పారిశ్రామికాభివృద్దికి…