YS Jagan: రేపు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌.. సూపర్‌స్టార్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..

Ys Jagan Mohan Reddy

Ys Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లనున్నారు.. టాలీవుడ్‌ సూపర్ స్టార్‌, తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన కృష్ణ కన్నుమూయడంతో.. రేపు హైదరాబాద్‌ వెళ్లనున్న ఆయన.. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.. సూపర్‌ స్టార్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.. సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో పేర్కొంది..

Read Also: NTR- Krishna: ఎన్టీఆర్- కృష్ణ మధ్య విభేదాలు.. పదేళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదట

అయితే, సూపర్‌స్టార్‌ భౌతికకాయాన్ని ఈ రాత్రికి నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు కుటుంబ సభ్యులు.. ముందుగా గచ్చిబౌలి స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం తరలించాలని భావించినా.. ఇంటి దగ్గర ఇప్పుడు అభిమానులకు అనుమతిఇస్తున్నారు.. ఇక, రేపు ఉదయం నేరుగా పద్మాలయ స్టూడియోకి తీసుకెళ్లనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ప్రజల సందర్శనార్థం సూపర్‌స్టార్‌ పార్థివదేహాన్ని ఉంచనున్నారు.. ఆ తర్వాత అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు సాగనుంది.. మహాప్రస్థానంలో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.