ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు.. టాలీవుడ్ సూపర్ స్టార్, తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన కృష్ణ కన్నుమూయడంతో.. రేపు హైదరాబాద్ వెళ్లనున్న ఆయన.. సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.. సూపర్ స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. మధ్యాహ్నం 2.20…