NTR- Krishna: చిత్ర పరిశ్రమలో ప్రతి హీరోకు మంచి కథలు చెయ్యాలనే కోరిక ఉంటుంది. ఇక ఒక హీరోతో అనుకున్న సినిమా మరో హీరోతో పూర్తి అవుతుంది. కొన్నిసార్లు ఈ కథల మార్చడం వలన కూడా హీరోల మధ్య విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. ఎన్టీఆర్, కృష్ణ మధ్య కూడా ఇలాంటి విభేదాలు తలెత్తాయట. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు.. మొదట కథను ఎన్టీఆర్ కు వినిపించి.. కొన్ని కారణాల వలన ఆ సినిమాను కృష్ణ తో చేశారు. ఆ సినిమా అప్పట్లో హిట్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ కు, కృష్ణకు మధ్య దూరం పెరిగిందట. దాదాపు పదేళ్ల వరకు ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేదట.
ఇక అలాంటి సినిమానే ఎన్టీఆర్ చేద్దామని పరుచూరి బ్రదర్స్ ను కథ రాయమని అడుగగా.. వారు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసారా..? చాలా అద్భుతంగా ఉందని పొగిడారట. వెంటనే ఎన్టీఆర్ అక్కడి నుంచి లేచి.. నేను ఇంకా సినిమా చూడలేదు.. ఇక ముందు కూడా చూడను అని చెప్పారట. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక ఈవెంట్ లో కృష్ణ, ఎన్టీఆర్ ఎదురుపడగా.. ఎన్టీఆరే, కృష్ణను పిలిచి అల్లూరి సీతారామరాజు చూడాలని ఉంది.. నువ్వే స్వయంగా చుపిస్తావా..? అడిగారట. వెంటనే కృష్ణ ఆయనకు స్పెషల్ గా ప్రింట్ వేసి చూపించగా.. కృష్ణ నటనకు ముగ్దుడైన ఎన్టీఆర్ ఆయనను కౌగిలించుకొని బావుందని ప్రశంసించారట. ఆ తర్వాత కృష్ణ తన ఇంట్లో ఫంక్షన్ కు స్వయంగా పిలవడంతో వీరిద్దరి మధ్య మళ్లీ మాటలు కుదిరాయట. ఈ విషయాన్నీ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు.