ధాన్యం సేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల అన్నారు. రైస్ మిల్లుల వద్ద స్పేస్ లేకున్నా.. మిల్లులు సహకరించకున్నా.. తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి అంటూ ఆయన పేర్కొన్నారు.
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా…