Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Chandrababu Welfare Commitment Super Six Progress Housing Jobs

CM Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం

Published Date :January 18, 2026 , 8:53 pm
By Gogikar Sai Krishna
  • ఆర్థిక ఒత్తిడిలోనూ సంక్షేమమే లక్ష్యం
  • 'సూపర్ సిక్స్' నుండి 'సూపర్ హిట్' వరకు
  • ఉపాధి, డిఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ వేగవంతం
  • లక్షల గృహ ప్రవేశాలు.. ఉగాదికి కొత్త లక్ష్యాలు
CM Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ‘సూపర్ హిట్’ అయ్యాయని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ (దీపం-2), అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ఎంతో సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ క్రమంలోనే సామాజిక భద్రతా పెన్షన్లను గణనీయంగా పెంచి పేదలకు అండగా నిలిచామని పునరుద్ఘాటించారు.

ఉద్యోగ కల్పన విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎన్నో న్యాయపరమైన అడ్డంకులు , రాజకీయ కుట్రలు ఎదురైనప్పటికీ మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. అలాగే గృహ నిర్మాణ రంగంలో తమ ప్రభుత్వం సృష్టించిన రికార్డును ప్రస్తావిస్తూ, ఇటీవలే మూడు లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశాలు చేయించామని, రాబోయే ఉగాది నాటికి మరో ఐదు లక్షల మందికి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మూడున్నర ఏళ్ల కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు.

Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • employment
  • housing projects
  • mega dsc

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions