గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్డ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాల తుఫాన్ నడుస్తుంది. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయ్యినప్పటి నుంచే ఈ సీక్వెల్‌పై హైప్ పెరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ అన్నది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు స్పష్టంగా చూపించాయి. ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా కొత్త డేట్ ఫిక్స్ అవ్వగా డిసెంబర్ 11న అంటే నేడు పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా, డిసెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యిన వెంటనే అభిమానులు తక్షణమే స్పందించారు.ఒక్క గంటలోనే 18.5K టికెట్లు సేల్ కావడం సినిమాపై ఉన్న మాసివ్ బజ్‌కు నిదర్శనం. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు… యాక్షన్ లవర్స్, సాధారణ మూవీ బఫ్స్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పైగా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్లు ఓపెన్ అయితే ఇంకెంత డిమాండ్ ఉండబోతుందో ఊహించుకోవచ్చు. దీంతో ‘అఖండ 2: తాండవం’ ఏడాది చివర్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని ఇండస్ట్రీ టాక్. బాలయ్య మాస్ రేజ్, బోయపాటి యాక్షన్ ఎలిమెంట్స్ కలిసి మరోసారి థియేటర్లలో తాండవం చేయబోతున్నాయనే విశ్వాసంతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.