AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి, పెట్టుబడులకు పచ్చజెండా
- నీటి పథకాలకు భారీ ఆమోదం
- అమరావతిలో పరిశ్రమలకు పచ్చజెండా
- విరూపాక్షకు 100 ఎకరాలు
- వైజాగ్–చెన్నై కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet : అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల సృష్టికి సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని నీటిపథకాల అభివృద్ధి కోసం భారీగా రూ.9,514 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. త్రాగునీరు, సాగునీరు విభాగాల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
పరిశ్రమల విస్తరణలో భాగంగా, ప్రముఖ విరూపాక్ష ఆర్గానిక్స్ సంస్థకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో పెట్టుబడులకు వేగం చేరేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటు నేపథ్యంలో సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలును ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Divorce Case: పెళ్లయిన 3 రోజులకే విడాకులు కోరిన భార్య.. కారణం ఇదే..
అమరావతి రాజధానిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరయ్యాయి. రాజధాని నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇవి కీలక ముందడుగులుగా భావిస్తున్నారు. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధికి ఇది పెద్ద ఊతమివ్వనుంది. కుప్పం నియోజకవర్గంలో పాలర్ నదిపై నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించి సవరించిన అనుమతులకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.
ఉపాధ్యాయ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం ప్రకారం, 417 మంది భాషా పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూళ్లలో భాషా బోధన నాణ్యత మరింత మెరుగుపడనున్నదని విద్యాశాఖ భావిస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, నీటి వనరులు, విద్య తదితర రంగాల్లో వేగవంతమైన పురోగతికి దోహదం చేయనున్నాయి.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కస్డడీకి ప్రభాకర్ రావు
తాజావార్తలు
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!