AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
- అమరావతికి చట్టబద్ధతపై కీలక నిర్ణయం
- ఆస్తి పన్ను వడ్డీ మాఫీతో ప్రజలకు ఊరట
- రాష్ట్రవ్యాప్తంగా కొత్త కోర్టులకు గ్రీన్ సిగ్నల్
- పరిశ్రమలు, విద్య, గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను అనుసరిస్తూ, కొత్త రాజధాని స్థానంలో ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిపై మరింత లోతుగా చర్చించేందుకు ఈ శనివారం అసెంబ్లీలో నాలుగు గంటల పాటు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్‌లో రాజధాని చట్టబద్ధత సవరణ బిల్లును ప్రవేశపెట్టేలా ఒప్పించి, అమరావతిని శాశ్వత రాజధానిగా సుస్థిర పరచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇది రాజధాని ప్రాంత అభివృద్ధికి , పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు.
Crime: బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు.. 25 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
Also Read
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలకు , గృహ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది. విద్యా రంగానికి సంబంధించి కూడా కేబినెట్ పలు కీలక అనుమతులు మంజూరు చేసింది. నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం (SRM) వర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కుప్పం బాలికల పాఠశాలలో విద్యార్థినుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీఈటీ, నర్స్ , రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.
West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు , సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త జూనియర్ , సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. పారిశ్రామిక , వాణిజ్య పరంగా కూడా కొన్ని కీలక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా వడ్డీల సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం సినరేజ్ ఫీజుల్లో 50 శాతం భారీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది స్థానిక పారిశ్రామికవేత్తలకు , కార్మికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ‘సూర్యఘర్’ పథకం కింద సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించి పాలనలో తనదైన ముద్ర వేసింది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!